తండ్రి కాబోతున్న బ్రహ్మముడి రాజ్
on Jul 5, 2024
'బ్రహ్మముడి' సీరియల్ హీరో మానస్ నాగులపల్లి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. తన భార్య శ్రీజ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ శుభవార్త పంచుకున్నాడు. "మాది అరెంజ్డ్ లవ్. పెద్దలు కుదిర్చిన వివాహమైనా మా మనసులు కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి రెండు చిట్టి పాదాల బుజ్జాయి రాబోతోంది " అంటూ మానస్ ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో ఈ బుల్లితెర హీరోకు తన కొలీగ్ ఆర్టిస్ట్స్, ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నారు. అంతేకాదు తన భార్య శ్రీజకు సీమంతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇదిలా ఉంటే గతేడాది నవంబర్‌లో చెన్నైకు చెందిన శ్రీజను మానస్ వివాహం చేసుకున్నాడు.
నెల తిరిగేలోపు కొత్త కారు కూడా కొన్నాడు. కోయిలమ్మ సీరియల్‌తో మానస్ బుల్లితెరకు పరిచయం అయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అలరించాడు. హౌజ్‌లో ప్రియాంకతో లవ్ ట్రాక్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. బ్రహ్మముడి సీరియల్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇకపోతే మానస్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. 'కాయ్ రాజా కాయ్', 'ప్రేమికుడు' వంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు. అవి బాక్సాఫీసు వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో మళ్లీ బుల్లితెర హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీలో టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. ఇందులో రాజ్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Also Read